పార్లమెంట్ సమావేశాలు మూడు రోజులు పొడగింపు

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలను మూడు రోజుల పాటు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నట్లు సమాచారం. వాస్తవానికి పార్లమెంట్ సమావేశాలు 26వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే పలు బిల్లులపై చర్చ పూర్తి కాకపోవడంతో సమావేశాలను పొడిగించనున్నట్లు తెలుస్తోంది. నూతనంగా ఏర్పడిన 17వ లోక్‌సభ మొదటి పార్లమెంట్ సమావేశాలు జూన్ 17న ప్రారంభమైన సంగతి విదితమే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి