
సాక్షి, హైదరాబాద్: ఇటీవల తరచూ వినబడుతోన్న ‘ఆపరేషన్ గరుడ’కు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడే దర్శక,నిర్మాత, రచయిత అని ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. చంద్రబాబు తాను రాసుకున్న స్క్రిప్టును నటుడు శివాజీతో చెప్పించి, ఆపై 'ఆపరేషన్ గరుడ నిజం కావచ్చు..’ అంటూ దీర్ఘాలు తీయడం కుట్రలో భాగమేనని ఐవైఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘‘ఆపరేషన్ గరుడ నిజమవుతుందని తాను అన్న మాటలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా? తాను రాసిన స్క్రిప్టును నటుడు శివాజీతో పలికించి, ఇప్పుడేమో నవనిర్మాణ దీక్షలో ‘అదే నిజమవుతుంది..’ అనడంలో అంతరార్థం ఏమిటి? అని ప్రశ్నించారు. ‘‘ఆపరేషన్ గరుడ కు తమరే(చంద్రబాబే) నిర్మాత దర్శకులు రచయిత. ఒక నటుడిని ఎంపిక చేసి తమ మాటలు ఆయనచే పలికించారు. ఈరోజు నవనిర్మాణ దీక్ష లో ఆ నటుడు చెప్పింది నిజమే కావచ్చనిసెలవిచ్చారు. ఏమి ఐడియా సర్‌జీ!!’’ సాబ్జీ’’ అని ఐవైఆర్ రాసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ 'ఆపరేషన్ గరుడ' అనే ఎత్తుగడను ప్రారంభించిందని నటుడు శివాజీ కొద్ది రోజుల కిందట వెల్లడించడం తెలిసిందే.
ఆపరేషన్ గరుడ కు తమరే నిర్మాత దర్శకులు రచయిత.ఒక నటుడిని ఎంపిక చేసి తమ మాటలు ఆయనచే పలికించారు. ఈరోజు నవనిర్మాణ దీక్ష లో ఆ నటుడు చెప్పింది నిజమే కావచ్చనిసెలవిచ్చారు. ఏమి ఐడియా సాబ్జీ. @ncbn @YSRCParty @BJP4India @JanaSenaParty @Sakshi_News @tv9 @enadu @DeccanChronicle @hmtvlive
— IYRKRao , Retd IAS (@IYRKRao) 3 June 2018