మోదీపై హార్థిక్‌ ఘాటు విమర్శలు | Only a chaiwala can tell unemployed youth to sell snacks: Hardik | Sakshi
Sakshi News home page

మోదీపై హార్థిక్‌ ఘాటు విమర్శలు

Jan 22 2018 6:33 PM | Updated on Oct 22 2018 2:22 PM

Only a chaiwala can tell unemployed youth to sell snacks: Hardik - Sakshi

సాక్షి, గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోదీపై పటేళ్ల ఉద్యమ సారధి హార్థిక్‌ పటేల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఓ టీలు అమ్ముకునే వ్యక్తి మాత్రమే(పరోక్షంగా ప్రధాని నరేంద్రమోదీ) నిరుద్యోగులకు స్నాక్స్‌ అమ్ముకోండని చెప్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈమేరకు ట్వీట్‌ చేశారు.

'చాయ్‌లమ్ముకునే వ్యక్తి మాత్రమే సమోసాలు అమ్ముకొమ్మని నిరుద్యోగులకు చెప్తారు.. అంతేగానీ, ఆ వ్యక్తి ఆర్థిక వేత్త అయి ఉంటే ఇలాంటి మాటలు ఎప్పటికీ చెప్పరు' అని ట్వీట్‌లో హార్థిక్‌ పేర్కొన్నారు. ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉపాధిపై స్పందిస్తూ 'ఒక వ్యక్తి పకోడాలు అమ్ముకొని సాయంత్రానికి రూ.200 పట్టుకొని ఇంటికొస్తే దాన్ని ఉపాధిగా పరిగణిస్తారా? లేదా?' అని అన్నారు. దీనిపైనే హార్థిక్‌ మాట్లాడుతూ మోదీ పరోక్షంగా నిరుద్యోగులను సమోసాలు, పకోడాలు అమ్ముకొమ్మని సలహాలు ఇస్తున్నారంటూ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement