‘నితీష్‌ పిరికిపంద’ 

Nitish​ should be blamed for violence in Bihar - Sakshi

సాక్షి,పాట్నా : బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌పై ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. నితీష్‌ కుమార్‌ను పిరికిపందగా అభివర్ణించారు. రాష్ట్రంలోని అరారియా, భాగల్పూర్‌, దర్భంగాల్లో ఇటీవల చెలరేగిన హింసకు నితీషే బాధ్యత వహించాలని అన్నారు. నితీష్‌ భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. హింసకు ప్రేరేపించింది బీజేపీ వారే అయినా సీఎం నితీష్‌ కుమార్‌ దీనికి బాధ్యత వహించాలని తేజస్వి యాదవ్‌ స్పష్టం చేశారు.

బీజేపీ సీనియర్‌ నేత గిరిరాజ్‌ సింగ్‌ పైనా ఆరోపణలు చేశారు. దళితుల భూములను గిరిరాజ్‌ సింగ్‌ ఆక్రమించిని ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆరోపించారు. హింసకు పాల్పడుతున్న నిందితులు ఎలాంటి భయం లేకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నితీష్‌ పిరికిపందలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిరాజ్‌ సింగ్‌ బీహార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నా నితీష్‌ కుమార్‌ చోద్యం చూస్తున్నారని అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top