‘ఇంత పిరికి ప్రధానిని ఎన్నడూ చూడలేదు’

Never saw a more cowardly, weak PM than Modi - Sakshi

ప్రతాపగఢ్‌/జౌన్‌పూర్‌: నరేంద్ర మోదీ కన్నా పిరికి, బలహీన ప్రధానిని తానెప్పుడూ చూడలేదని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాపగఢ్, జౌన్‌పూర్‌ల్లో ప్రియాంక గురువారం ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఈయన (మోదీ) కన్నా ఎక్కువగా భయపడే, బలహీన ప్రధానిని నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక అన్నారు. మాజీ ప్రధాని, ప్రియాంక తండ్రి దివంగత రాజీవ్‌ గాంధీపై మోదీ ఇటీవల పలు ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే.

బుధవారం మోదీ మాట్లాడుతూ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను రాజీవ్‌ తన వ్యక్తిగత ట్యాక్సీలా ఉపయోగించుకుని అందులో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారని మోదీ అన్నారు. ఆ మరుసటిరోజే ప్రియాంక మాట్లాడుతూ ‘నెరవేర్చని హామీలపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. విపరీత ప్రచారం, ప్రముఖ టీవీ కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లో బలం రాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతం. ఆ ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరించే శక్తి ఉండాలి. ప్రతిపక్షం ఏం చెబుతుందో వినే శక్తి ఉండాలి. మరి ఈ ప్రధాని మన మాటలు చెవికెక్కించుకోవడం అటుంచితే, ఆయనకు సరిగ్గా సమాధానం చెప్పడం కూడా రాదు’ అని ప్రియాంక అన్నారు. తన ప్రచారాలతో మోదీ వాస్తవాలను కప్పిపుచ్చి, అంతా బ్రహ్మాండం, అద్భుతమని నమ్మిస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top