నాగాలాండ్‌ సీఎంగా రియో ప్రమాణస్వీకారం | Neiphiu Rio Takes Oath As Nagaland CM  | Sakshi
Sakshi News home page

Mar 8 2018 6:51 PM | Updated on Mar 8 2018 6:51 PM

Neiphiu Rio Takes Oath As Nagaland CM  - Sakshi

కోహిమా : నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ వ్యవస్థాపక నాయకుడు నైఫ్యూ రియో ప్రమాణ స్వీకారం చేశారు. నాగలాండ్‌ గవర్నర్‌ పీబీ ఆచార్య సమక్షంలో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వేడుకకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు నిర్మాలా సీతారామన్‌, కిరణ్‌ రిజుజులు హాజరయ్యారు. భారతీయ జనతాపార్టీ–నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ కూటమి మద్దతుతో రియో ప్రభుత్వం నెలకొంది. డిప్యూటీ సీఎంతో పాటు 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.

టీఆర్‌ జెలియాంగ్‌ కంటే ముందు వరుసగా 11 ఏళ్లపాటు మూడుసార్లు రియో ముఖ్యమంత్రిగా చేశారు.  నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ తరఫున మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన అర్ధాంతరంగా సీఎం పదవిని వదిలిపెట్టి 2014లో ఎంపీగా లోక్‌సభకు వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement