ఒడిశా సీఎం హెలికాప్టర్‌ తనిఖీ

Naveen Patnaik chopper checked by Election Commission's flying squad - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ హెలికాప్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. మంగళవారం రూర్కెలాలో రోడ్‌ షో కోసం పట్నాయక్‌ వచ్చినప్పుడు అధికారులు అక్కడకు చేరుకుని హెలికాప్టర్‌ను, అందులోని ఇతర సామగ్రిని తనిఖీ చేయాల్సి ఉందని కోరారని పట్నాయక్‌ భద్రతాధికారి చెప్పారు.

మోదీ హెలికాప్టర్‌లోనూ సోదాలు
ఒడిశాలోని సంబాల్‌పూర్‌లో మంగళవారం ఎన్నికలర్యాలీ వేళ ప్రధాని మోదీ హెలికాప్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం ఎస్పీజీ రక్షణ కలిగిన వారి హెలికాప్టర్‌ సోదా చేయొద్దు. దీంతో సోదా చేసిన కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారి మోహిన్సన్‌ను ఈసీ బుధవారం సస్పెండ్‌ చేసింది.  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top