మోదీ కాళ్లు పట్టుకున్నారా, లేదా?

Mudragada Writes Letter To Chandrababu Naidu - Sakshi

సాక్షి, కిర్లంపూడి : ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు నుంచి బయటపడటానికే  ప్రత్యేక హోదాను అమ్మేశారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. మంగళవారం చంద్రబాబును పలు అంశాలపై  ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాశారు. ‘ఓటుకు నోటు కేసులో భయపడే హైదరాబాద్‌ నుంచి విజయవాడకి పారిపోయి వచ్చారు, హోదా అమ్మేస్తాను అరెస్టు నుంచి కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకున్న  విషయం నిజం కాదా’ అని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి ఖర్చులు చెప్పలేకే ప్రత్యేక హోదా పేరుతో రోడ్డెక్కితే ప్రజలు గుర్తించలేరనుకోవడం చంద్రబాబు మూర్ఖత్వమే అవుతుందని ముద్రగడ అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక హోదాపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు తప్పా  సాధించాలనే తాపత్రయం లేదని మండిపడ్డారు. ఈ నాలుగు సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా నిజం మాట్లాడారా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారని ఆయన ప్రశ్నించారు. మీపైగాని, ప్రభుత్వంపై గాని ప్రశ్నిస్తే దాడి చేయించడం, అక్రమ కేసులు పెట్టించడం సిగ్గు అనిపించటం లేదా అని లేఖలో నిలదీశారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top