
సాక్షి, హైదరాబాద్ : ఎంపీటీసీలకు నిధులు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మారుస్తోందని ఎంపీటీసీల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం ఎంపీటీసీలకు ఏటా రూ.20 లక్షల నిధులివ్వాలని ఆ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలు, నిధులు, విధులు, అధికారాలను స్థానిక సంస్థలకే అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదవశాత్తు ఎంపీటీసీలకు ఏదైనా జరిగితే రూ.20 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోరారు.