విభజన హామీల అమలులో నిర్లక్ష్యం: వినోద్‌ | MP Vinod Kumar letter to modi | Sakshi
Sakshi News home page

విభజన హామీల అమలులో నిర్లక్ష్యం: వినోద్‌

Oct 14 2017 2:03 AM | Updated on Aug 15 2018 2:32 PM

MP Vinod Kumar letter to modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో రాష్ట్రానికిచ్చిన హామీలను అమలు చేయడంలో ఆలస్యమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ వినోద్‌కుమార్‌ శుక్రవారం లేఖ రాశారు. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, అయితే ఈ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం చట్టంలో ఎలాంటి కాలపరిమితి విధించలేదన్నారు. దీంతో ఇదే సాకుగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటును తాత్సారం చేస్తోందన్నారు.

ప్రస్తుతం హైకోర్టులో నియామకాలు చేపడుతుండడం వల్ల కొత్తగా నియమితులైన వారు హైకోర్టు విభజన సందర్భంగా తెలంగాణను ఆప్షనల్‌గా ఎంచుకుంటే స్థానికులకు నష్టం జరుగుతుందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితేనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు చెప్పడం సరికాదన్నారు. ఆర్టికల్‌ 170 పేరుతో సీట్ల పెంపు విషయంలో దాటవేత ధోరణి అవలంబించడం సమంజసం కాదన్నారు. హైకోర్టు విభజన, సీట్ల పెంపు బిల్లులను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement