
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన బిడ్డ జగన్ మోహన్‌రెడ్డికి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు
సాక్షి, హైదరాబాద్ : ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదేనని, సీనియర్ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత మంచు మోహన్‌బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో ఆయన ఓ పత్రికప్రకటనను విడుదల చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన బిడ్డ జగన్ మోహన్‌రెడ్డికి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని, దీంతో ప్రజలు ఆశీస్సులు అందజేసి ముఖ్యమంత్రిని చేశారన్నారు. కచ్చితంగా ప్రజలకు జగన్ మేలు చేస్తారని, మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ అని అభివర్ణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 150 సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.