ప్రశ్నించే హక్కును ప్రభుత్వం హరిస్తోంది

mla sunnam rajaiah slams trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే హక్కును హరిస్తోందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద మాట్లాడుతూ... సభలో ప్రజా సమస్యలపై, శాసనసభ్యుల సస్పెన్షన్‌పై కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యుల హక్కుల్ని హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో రూ.5,500 వేతనం ఇస్తుంటే... ఇక్కడ మాత్రం రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారన్నారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top