breaking news
right to question
-
ప్రశ్నించే హక్కును ప్రభుత్వం హరిస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే హక్కును హరిస్తోందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ... సభలో ప్రజా సమస్యలపై, శాసనసభ్యుల సస్పెన్షన్పై కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యుల హక్కుల్ని హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో రూ.5,500 వేతనం ఇస్తుంటే... ఇక్కడ మాత్రం రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారన్నారు. -
'తెలుసుకుంటే సరిపోదు.. ప్రశ్నించాలి'
-
'తెలుసుకుంటే సరిపోదు.. ప్రశ్నించాలి'
న్యూఢిల్లీ: ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తప్పకుండా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా కేవలం సమాచారం తెలుసుకోవడమే ప్రజల హక్కుగా ఉండకూడదని, దాని ద్వారా తప్పకుండా ప్రశ్నించాలని గుర్తుచేశారు. అప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందని తెలిపారు. వ్యవహార లావేదేవీలు ఆన్లైన్ ద్వారా జరగడంవల్ల పారదర్శకత దానంతట అదే పెరుగుతుందని, విశ్వాసం కూడా మెరుగవుతుందని చెప్పారు. ఇంతకాలానీకి కూడా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమీ లేదని పరిపాలనలో చాటుగా కాకుండా బాహాటంగా వ్యవహరించాలని దానితో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.