‘చం‍ద్రబాబు పార్టీని సింగపూర్‌ తరిమికొడతారు’ | MLA Grandi Srinivas slams Cm chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చం‍ద్రబాబు పార్టీని సింగపూర్‌ తరిమికొడతారు’

Nov 20 2017 12:34 PM | Updated on Mar 23 2019 9:10 PM

సాక్షి, భీమవరం : ప్రజలు బ్రిటీష్‌ వారిని దేశం నుంచి తరిమి కొట్టినట్లు చంద్రబాబును, టీడీపీ పార్టీని సింగపూర్‌ తరిమి కొడతారని వైఎస్సార్‌సీపీ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా కోసం రాజ్యాంగబద్దంగా శాంతియుతంగా పోరాడుతుంటే అన్నిచోట్లా  హౌస్ అరెస్టు చెయ్యడం చాలా దారుణమని మండిపడ్డారు.

ఇక ప్రత్యేక హోదా కల్పించాలని వామపక్ష పార్టీలు చలో విజవాయడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా సీపీఎం, సీపీఐ, వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, అరెస్టులు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement