ఎమ్యెల్యే బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనం | Mla Balakrishna Is A Scarecrow Burning | Sakshi
Sakshi News home page

ఎమ్యెల్యే బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనం

Apr 21 2018 9:06 AM | Updated on Mar 28 2019 8:37 PM

Mla Balakrishna Is A Scarecrow Burning - Sakshi

దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న బీజీపీ నాయకులు

కదిరి అర్బన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లిపై అనుచిత వాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ దిష్టిబొమ్మను శుక్రవారం స్థానిక వేమారెడ్డికూడలిలో బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఎమ్యెల్యేగా ఉంటూ ప్రధానమంత్రి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. సంస్కారం లేకుండా మాట్లాడటం తగదని, పెద్దలను గౌరవిస్తూ మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తలుపుల గంగాధర్, రాజశేఖర్‌బాబు, ఆంజనేయులు, నాగేంద్రప్రసాద్, వేణుగోపాల్‌రెడ్డి, రామక్రిష్ణ, ఉత్తమర్‌రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement