‘ఈసీకి అంతుపట్టని వైరస్‌ సోకింది’ | Minister Adimulapu Suresh Firs On Chandrababu | Sakshi
Sakshi News home page

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట

Mar 16 2020 9:42 AM | Updated on Mar 16 2020 10:12 AM

Minister Adimulapu Suresh Firs On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అంతుపట్టని వైరస్‌ సోకిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలను వాయిదా వేయించడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులను అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర అని మండిపడ్డారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రమేష్‌కుమార్‌ ఎలా నిర్థారణకు వచ్చారని సురేష్‌ ప్రశ్నించారు.స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి చంద్రబాబుతో పాటు ఎవరెవరు చేతులు కలిపారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయటంతో చంద్రబాబు దిట్ట అని దుయ్యబట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడతారని తెలిపారు. (ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ)

పెద్ద కుట్రే జరిగింది..
తూర్పుగోదావరి: ఎన్నికలను నిలుపుదల చేయించి..రాష్ట్రానికి నిధులు రాకుండా చేయడానికి పెద్ద కుట్రే జరిగిందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ మండిపడ్డారు. చంద్రబాబు కుల రాజకీయాన్ని ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నారని ఆమె విమర్శించారు. ఎన్నికల్లో మరోసారి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. 
(ఎన్నికలకు ఎల్లో వైరస్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement