మత ఘర్షణలకు బీజేపీ కుట్ర: దీదీ

Mamata Banerjee Fires On Modi In Mega Rally - Sakshi

కోల్‌కత్తా: అధికార దాహంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చివేస్తోందని బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి నిదర్శనం కర్ణాటక రాజకీయ సంక్షోభమేనని అన్నారు. బెంగాల్‌లో కూడా టీఎంసీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ.. బలవంతగా పార్టీలో చేర్చుకుంటున్నారని దీదీ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న బెంగాల్‌లో మత సంఘర్షణ సృష్టించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌ ప్రజలను ఈవీఎంలతో ఛీటింగ్‌ చేసి బీజేపీ గెలిచిందని అన్నారు.

దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్‌ పద్దతిన ఎన్నుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మమత విమర్శించారు. కాగా ఆదివారం బెంగాల్‌ రాజధాని కోల్‌కత్తాలో టీఎంసీ భారీ మెగా ర్యాలీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. కాగా ప్రతి ఏడాది జాలై 21న కోల్‌కత్తాలో టీఎంసీ మెగా ర్యాలీని ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top