మమతా ప్రవర్తన స‌ద్దాం హుస్సేన్‌లా ఉంది : వివేక్‌

Mamata Banerjee Behave Like Saddam Hussein Says Vivek Oberoi - Sakshi

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీని ఇరాక్ మాజీ నియంత స‌ద్దాం హుస్సేన్‌తో పోలుస్తూ ట్విట్ చేశారు. ‘ గౌరవనీయులైన ఒక మహిళ (మమతా బెనర్జీ) ఇరాక్‌ మాజీ నియంతలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడంలేదు. దీదీ తనకు తానే ప్రజాస్వామ్యానికి ముప్పులా పరిణమించారు. మొదట ప్రియాంక శర్మను, ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ బగ్గాను నిర్భందించారు. బెంగాల్‌ను రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’  అని వివేక్‌ ట్విట్‌ చేశారు. 

చదవండి : బెంగాల్‌లో టెన్షన్‌.. టెన్షన్‌

కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ బగ్గాను గృహ నిర్భంగా చేశారు. ఈ నేపథ్యంలోనే వివేక్‌ పైరకంగా స్పందించారు. బీజేపీపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే వివేక్‌ వెంటనే స్పందిస్తున్నారు. హిందూ ఉగ్రవాదంపై మక్కల్‌ నీదీ మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా వివేక్‌ ఒబెరాయ్‌ తప్పుపట్టిన సంగతి తెలిసిందే.ఆయన ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయోపిక్ లో నటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top