మధ్యప్రదేశ్‌ : 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా

Madhya Pradesh Political Crisis: 19 Congress MLAs Have Resigned - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. సోమవారం తన వర్గం ఎమ్మెల్యేలతో బెంగళూరుకు మకాం మార్చిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, ఆ వెంటనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. సింధియా రాజీనామా చేసిన వెంటనే.. తన వర్గపు 20మంది ఎమ్మెల్యేలు తమ పదవి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు.  వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది.
(చదవండి : కాంగ్రెస్‌ పార్టీకి సింధియా రాజీనామా)


మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230. అయితే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే మృతి చెందడంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 228కి చేరింది. కాంగ్రెస్‌ 114, బీజేపీ 107, స్వతంత్రులు 4, బీఎస్పీ 2, ఎస్పీ ఒక ఎమ్మెల్యే బలం కలిగిఉంది. కాంగ్రెస్‌కి స్వతంత్రులు, మిత్రపక్షాలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 20మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మరోవైపు  మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోసారి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కే మధ్యప్రదేశ్‌ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top