కారు జోరు.. తెలంగాణ భవన్‌లో సంబరాలు

KCR Reached Telangana Bhavan Win In Municipality Elections - Sakshi

తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌

మున్సిపల్‌ ఫలితాలపై హర్షం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే తెలంగాణ భవన్‌ చేరుకుని, అక్కడ నుంచి ఎన్నికల కౌంటింగ్‌ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక ఫలితాల అనంతరం సంబరాలు జరపడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 120 మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాల్లో అధికార కారు పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను చిత్తుచేస్తూ.. పూ​ర్తి ఆధిక్యంలో దూసుకుపోతోంది. (మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ బోణి)

దీంతో తెలంగాణ భవన్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈనెల 22న ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార టీఆర్‌ఎస్‌ అనుకూల ఫలితం దాదాపు ఖాయమే అయినా ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఫలితాల అనంతరం కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. (మున్సిపల్‌ ఎన్నికలు : కౌంటింగ్‌ అప్‌డేట్స్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top