చంద్రబాబును తరిమికొట్టాలి | Kodali Nani Fired On CM Chandra Babu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును తరిమికొట్టాలి

Nov 15 2017 10:37 AM | Updated on Jul 28 2018 6:51 PM

Kodali Nani Fired On CM Chandra Babu Naidu - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని, పక్కన డాక్టర్‌ దుట్టా, యార్లగడ్డ

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: అబద్దాలకోరు చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ  నియోజకవర్గ సమన్వయకర్తగా యార్లగడ్డ వెంకట్రావు నియమితులైన సందర్భంగా హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడు దుట్టా రామచంద్రరావు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు.

తొలుత డాక్టర్‌ దుట్టా నివాసం నుంచి ర్యాలీగా అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్లారు. హనుమంతుడికి ఎమ్మెల్యే కొడాలి నాని, డాక్టర్‌ దుట్టా, యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శుభకృష్ణ ఎన్‌క్లేవ్‌లో సమావేశం నిర్వహించారు. కొడాలి నాని మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని,  ఆయన్ను తరిమికొట్టాలని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధి మొత్తం ఆయన అనుకూల మీడియా,  పేపర్లులోనే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాదు నుంచి తరిమికొట్టితే, ఇక్కడికి వచ్చి బాబు తల దాచుకుంటున్నాడన్నారు. సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు.

గన్నవరాన్ని కంచుకోటగా మార్చుదాం: దుట్టా
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గన్నవరం నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుదామని కార్యకర్తలకు డాక్టర్‌ దుట్టా పిలుపు నిచ్చారు. మహానేత వైఎస్సార్‌తో ఉన్న సాన్నిహిత్యంతో వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పాటుపడ్డానని చెప్పారు.

కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, పార్టీ జిల్లా కార్యదర్శి నక్కా గాంధి, గన్నవరం ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోటగిరి వరప్రసాద్, విజయవాడ రూరల్‌ మాజీ ఎంపీపీ యార్కారెడ్డి నాగిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బేతాళ ప్రమీలారాణి, కొనకళ్ల వెంకటేశ్వరరావు, కొండేటి రామకోటయ్య, పామర్తి సత్యనారాయణ, వేముల శ్రీను, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కోడెబోయిన బాబి, బాపులపాడు మండల అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ, మాజీ మండల అధ్యక్షుడు యనమదల సాంబశివరావు, తేలప్రోలు పీఏసీఎస్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ గెలుపే లక్ష్యం : యార్లగడ్డ
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండాను గన్నవరం నియోజకవర్గంలో రెపరెపలాడించటమే లక్ష్యంగా పని చేస్తానని నూతన సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాలపై ఆకర్షితుడైనట్లు చెప్పారు. చిరకాల మిత్రుడు కొడాలి నాని, సినీయర్‌ నేత డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు సలహాలు, సూచనలతో పార్టీని నియోజకవర్గంలో బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement