ప్రశాంతంగా కర్ణాటక ఉప ఎన్నికలు | Karnataka Assembly and Lok Sabha Bypoll Election | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా కర్ణాటక ఉప ఎన్నికలు

Nov 4 2018 4:50 AM | Updated on Mar 18 2019 9:02 PM

Karnataka Assembly and Lok Sabha Bypoll Election - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రెండు శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకు శనివారం ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. బళ్లారి, మాండ్య, శివమొగ్గ లోక్‌సభ స్థానాలు, రామనగర, జమఖండి అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఐదు చోట్లా ప్రతిపక్ష బీజేపీ ఒంటరిగా, అధికార కాంగ్రెస్‌–జేడీఎస్‌లు ఉమ్మడిగా పోటీకి దిగాయి. మొత్తం 66.8 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం సమయానికి పుంజుకుంది. ఈ నెల 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌–జేడీఎస్‌ల మధ్యే ఉంది. విజయంపై అన్ని పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement