మోదీ ప్రమాణ స్వీకారం.. కమల్‌కు ఆహ్వానం

Kamal Haasan Invented To Narendra Modi Swearing - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రెండో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాటు పూర్తి కావోస్తున్నాయి.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురికి మోదీ ఆహ్వానాలు పంపుతున్నారు. అందులో భాగంగా తాజాగా సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు ఆహ్వానం పంపారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోదీ, కమల్‌ను ఆహ్వానించారు. మే 30న రాత్రి 7 గంట‌ల‌కు రాష్ట్రప‌తిభ‌వ‌న్‌లో మోదీ ప్రమాణం చేయ‌నున్నారు. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌.. మోదీతో ప్రమాణం చేయిస్తారు.

నాథూరామ్ గాడ్సే మొట్టమొద‌టి హిందూ ఉగ్రవాది అని ఎన్నిక‌ల వేళ క‌మ‌ల్‌హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. దానిపై బీజేపీ నేతలు సర్వత్రా విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కమల్‌ను మోదీ ఆహ్వానించడం విశేషం. అయితే కమల్‌ ఈ ఆహ్వానంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి 352 సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించింది. బీజేపీయే సొంతంగా 303 స్థానాల్లో విజయం సాధించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top