అక్కడి నుంచి పోటీ చేస్తారా? | Sakshi
Sakshi News home page

ఆర్కేనగర్‌ నుంచి కమల్‌ పోటీ?

Published Sat, Oct 21 2017 8:31 PM

Kamal Haasan - Sakshi

చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నై ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా నటుడు కమల్‌హాసన్‌పై అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. డిసెంబర్‌ రెండో వారంలో ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక జరగనుంది. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని కమల్‌హాసన్‌ ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకునే రాజకీయాల్లోకి రావడానికి కమల్‌ వంద రోజుల గడువు విధించుకున్నట్లు సమాచారం.

ఇదిలాఉండగా, గత ఏడాది ఏప్రిల్‌లో రద్దయిన ఈ ఉప ఎన్నికలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన మరుదు గణేష్‌ శనివారం ఈసీకి లేఖ రాశారు. ఓటర్లకు భారీ ఎత్తున డబ్బు పంపిణీ రుజువు కావడం వల్ల ఉప ఎన్నికను రద్దు చేశారని, అయితే రద్దుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదని అందులో పేర్కొన్నారు. ఆనాటి ఎన్నికల్లో రూ.5 లక్షలు ఖర్చు చేసిన తనకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీని కోరారు. లేకుంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందన్నారు.

Advertisement
Advertisement