బీజేపీలో చేరిన సింధియా | Jyotiraditya scindia Joins In BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన సింధియా

Mar 11 2020 2:52 PM | Updated on Mar 11 2020 8:53 PM

Jyotiraditya scindia Joins In BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి, గ్వాలియర్‌ రాజవంశస్తుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురుకు కేంద్రమంత్రులతో సహా, బీజేపీ పెద్దలు హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఉన్న విభేదాల కారణంగా మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. పార్టీలో సరైన ప్రాతినిధ్యం లభించడంలేదని భావించిన సింధియా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా భేటీ అనంతరం హస్తం పార్టీకి రాజీనామా సమర్పించారు.

ఈ పరిణామం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఊహించినట్టుగానే ఆయన కాషాయదళంలో చేరారు. అయితే బీజేపీ నుంచి సింధియాను రాజ్యసభకు పంపుతారని, మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రి పదవి కూడా కట్టబెడతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై బుధవారం రాత్రి నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది.


 

Advertisement
 
Advertisement
Advertisement