జార్ఖండ్ రెండోదశ పోలింగ్.. ఒకరి మృతి

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం కోనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.3 పోలింగ్ శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఈ రోజు 20 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తూర్పు జంషెడ్‌పూర్ నుంచి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, మరో మంత్రి పోటీ చేస్తున్ననియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. మొదటి విడత పోలింగ్ నవంబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. గుమ్ల నియోజకవర్గంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చేందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు, భద్రత సిబ్బంది చర్యలు తీసుకుంటాన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు జార్ఖండ్ అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ శాతం ఈ విధంగా నమోదైంది.
ఘాట్షిలా- 49.9%
బహరాగోరా- 52.2%
పోట్కా- 48%
చైబాసా- 40.13%
జంషెడ్పూర్ (తూర్పు) - 35.3%
జంషెడ్పూర్ (వెస్ట్) - 33.15%
సిసాయి- 54.56%
కోలేబిరా- 46%
జుగల్సాయ్- 44.1%
మందర్- 49.84%
సిమ్‌దేగా- 45.4%
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి