బిహార్‌లో ‘ఫొటో’ రాజకీయాలు

JD(U), RJD engage in ‘picture war’ - Sakshi

పట్నా: బిహార్‌లో నిందా రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ఓ యువతితో కలసి పార్టీలో పాల్గొన్న పాత ఫొటోను అధికార జేడీయూ శుక్రవారం విడుదల చేసింది. దీనిపై తేజస్వి స్పందిస్తూ...జేడీయూ పాలనలో అవినీతి, అక్రమంగా సాగుతున్న మద్యం అమ్మకాలు వెలుగులోకి రావడంతో సీఎం నితీశ్‌ ప్రతిష్ట దెబ్బతింటోందని దానికి బదులుగానే తన పాత ఫొటోను తాజాగా తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుర్తు తెలియని యువతితో తేజస్వి ఉండగా వారి వెనక బీర్‌ సీసా ఉన్నట్లు చూపుతున్న ఆ ఫొటోను జేడీయూ నేతలు విడుదలచేశారు. కాగా, తేజస్వి స్పందిస్తూ.. ‘ఆ ఫొటో నేను రాజకీయాల్లోకి రాకముందుది. ఐపీఎల్‌ టోర్నమెంట్‌ సమయంలో తీసిఉండొచ్చు. ఆమెతో నాకు పరిచయం లేదు. అయినా ఆ ఫొటోలో అభ్యంతరకరంగా ఏం ఉంది?’ అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top