
సాక్షి, అనంతపురం(ఉరవకొండ): ‘జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ బచ్చా.. ఆయనకు సినిమాలంటే తెలుసు కానీ ప్రజా సమస్యలు ఏం తెలుసు’ అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యనించారు. ఈ రోజు ఆయన ఉరవకొండలో ఎమ్మెల్సీ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ చేపట్టిన సంఘీభావ దీక్షలో మాట్లాడుతూ.. పవన్‌కు కేవలం ప్రశ్నించడం మాత్రమే తెలుసని అన్నారు. సినిమాల్లో మాదిరి ఇక్కడ నటించడం అంత సులవు కాదన్నారు.
పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి కూడా కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రజారాజ్యం పార్టీ పెట్టారని, ఆ పార్టీ గతి ఏమైయిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయుడుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలతో ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.