రజనీ, కమల్‌ హాసన్‌లను హెచ్చరించిన నటి | Jaya Prada welcomes and warns Rajinikanth and Kamal | Sakshi
Sakshi News home page

రజనీ, కమల్‌ హాసన్‌లను హెచ్చరించిన నటి

Jan 18 2018 9:35 PM | Updated on Sep 17 2018 4:56 PM

Jaya Prada welcomes and warns Rajinikanth and Kamal - Sakshi

సాక్షి, చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్, సినీ నటుడు రజనీకాంత్, కమల్ హాసన్‌ల రాజకీయ రంగ అరంగేట్రాన్ని తాను స్వాగతిస్తున్నట్లు సినీనటి, మాజీ ఎంపీ జయప్రద చెప్పారు. అయితే రజనీ, కమల్ వెళ్లేదారి పూలదారి మాత్రం కాదని, ఎన్నో ముళ్లుంటాయి, రాళ్లుంటాయని చూసి అడుగేయాలంటూ ఆ నటులను జయప్రద హెచ్చరించారు. రాజకీయాలంటే కేవలం రెండున్నర గంటల సినిమా మాత్రం కాదన్నారు. సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందన్నారు. ఈ సీనియర్ నటుల రాజకీయ అరంగేట్రంపై మాట్లాడుతూ.. రజనీ, కమల్ రాణిస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. తన రాజకీయ పునరాగమనం ఎప్పుడనేది త్వరలోనే వెల్లడిస్తానని మాజీ ఎంపీ జయప్రద అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement