మంత్రి ఆదికి ఊహించని షాక్‌ | Jammalamadugu TDP Leaders Joins YSRCP | Sakshi
Sakshi News home page

Jan 29 2019 7:20 PM | Updated on Jan 29 2019 7:43 PM

Jammalamadugu TDP Leaders Joins YSRCP - Sakshi

వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ తగిలింది.

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ తగిలింది. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన కీలక నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్సార్‌ సీపీలోకి వచ్చారు. పార్టీ కండువాలతో వీరిని వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు.

కొండాపురం, ముద్దనూరు, పెద్దముడియం మండలాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, ముని రాజారెడ్డి, బొందల గుంట సుబ్బయ్య, స్టాల్ పిరా సోదరులు, పెద్దముడియం ఈశ్వర్ రెడ్డి, దస్తగిరి రెడ్డి, తదిరులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్‌ సీపీలోకి వచ్చారు.


 

Advertisement
 
Advertisement
Advertisement