కోమటిరెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు.. | jagadesh reddy lashes out at komatireddy venkatareddy | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు..

Feb 19 2018 6:51 PM | Updated on Mar 18 2019 9:02 PM

jagadesh reddy lashes out at komatireddy venkatareddy - Sakshi

సాక్షి, సూర్యాపేట : జిల్లాలో కాంగ్రెస్‌ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి జగదీష్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ నేతలకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ సొంత తమ్ముడని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో అతడి భార్య లక్ష్మికి నల్లొండ అసెంబ్లీ టికెట్‌ ఇస్తానని చెప్పి మాట మార్చారని విమర్శించారు. పూటకో మాట మాట్లాడుతున్న కోమటిరెడ్డి ప్రజలందరినీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కోమటిరెడ్డికి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement