మిమ్మల్ని మించిన సైకోలు ఉండరు | Inti Party Cheruku Sudhakar Fires On Etela Rajender | Sakshi
Sakshi News home page

మిమ్మల్ని మించిన సైకోలు ఉండరు

Apr 26 2020 3:30 AM | Updated on Apr 26 2020 3:30 AM

Inti Party Cheruku Sudhakar Fires On Etela Rajender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ హాస్పిటల్‌లో వైద్య సేవలపై, సెక్రటేరియట్‌ను కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చడంపై ప్రతిపక్షాలు చేసిన సూచనలపై ఆయన అహంకారపూరితం గా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వేల మందికి ఎమర్జెన్సీ వైద్య సేవలందించే గాంధీ హాస్పిటల్‌ను పూర్తి స్థాయి కరోనా హాస్పిటల్‌గా మారుస్తున్నామని ప్రకటించి, లక్ష ల మందిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతిపక్షాల సూచనలను విమర్శించడం సరికాదని అన్నారు. కరోనా పారాసిటమాల్‌తో తగ్గుతుందని, మాస్కులు మా అందరికీ ఉన్నా యా అని వెకిలి నవ్వు నవ్వి, సైకో వైఖరి ని అవలంబించింది సీఎం కేసీఆర్‌ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఖాళీగా ఉన్న సెక్రటేరియట్‌ను ఐసోలేషన్‌ వార్డు కింద మార్చి, దగ్గర్లో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి చాంబర్‌ నుంచి పర్యవేక్షించడం వివేకమైన పని అన్నారు. కొత్త హాస్పిటల్స్‌ను కోవిడ్‌ స్పెషాలిటీగా మార్చి, ఉస్మాని యా, గాంధీ, నిమ్స్‌లో ఆధునిక, ఎమర్జెన్సీ వైద్యసేవలు నిరాటంకంగా జరగాలన్న తమ సూచన వారికి శాడిస్టు తీరుగా కనపడిందా? అని చెరుకు సుధాకర్‌  ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement