నా పెళ్లే అందుకు నిదర్శనం: అఖిలేశ్‌

 I don't believe in caste, biggest proof is my marriage with Dimple - Sakshi

న్యూఢిల్లీ: తానెప్పుడు కుల రాజకీయాలు చేయలేదనీ, చేయబోనని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు. మరో సామాజికవర్గానికి చెందిన యువతి డింపుల్‌ను తాను పెళ్లి చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్‌ మాట్లాడుతూ..‘కులం, మతం వంటి విషయాలను నేను నమ్మను. నా పెళ్లే దీనికి పెద్ద ఉదాహరణ. ఎందుకంటే వేర్వేరు కులాలకు చెందినవారైనప్పటికీ నేను, డింపుల్‌ పెళ్లి చేసుకున్నాం. కులం గోడలు బద్దలుకొట్టి వివాహం చేసుకున్నాం’ అని తెలిపారు. బీజేపీ కుల, మత రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. డింపుల్‌ ఘర్వాల్‌ సామాజికవర్గానికి చెందినవారు కాగా, అఖిలేశ్‌ది యాదవ సామాజికవర్గం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top