హైదరాబాద్‌ నా వల్లే అభివృద్ధి జరిగింది | Hyderabad Is Developed By Me Said By AP CM Nara Chandra Babu Naidu | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నా వల్లే అభివృద్ధి జరిగింది

Apr 30 2018 7:47 PM | Updated on Mar 28 2019 5:23 PM

Hyderabad Is Developed By Me Said By AP CM Nara Chandra Babu Naidu - Sakshi

తిరుపతి ధర్మ పోరాట సభలో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(పాత చిత్రం)

తిరుపతి : హైదరాబాద్‌ తన వల్లే అభివృద్ధి జరిగిందని మరో మారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరుగుతున్న ధర్మ పోరాట సభలో మాట్లాడుతూ..ఒక పద్ధతీ పాడూ లేకుండా రాష్ట్రాన్ని విభజించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలే రాష్ట్ర విభజనకు కారణమన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా మీద హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

నెల్లూరు సభలో ఢిల్లీస్థాయి రాజధానిని నిర్మిస్తున్నానని చెప్పారని గుర్తుచేశారు. నీతిమాలిన పార్టీలకు నరేంద్ర మోదీ మద్ధతు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూశామని, ఇక నుంచి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement