కేరళ అభ్యర్థులపై వందల్లో కేసులు

Hundreds Of Cases Against Kerala Candidates - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని ఇదుక్కి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డీన్‌ కురియాకోస్‌పై 193 కేసులు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఆ కేసుల వివరాలను ఎన్నికల ముందు కనీసం మూడు రోజులపాటు వార్తా పత్రికలు, కనీసం ఒక్క టీవీ ఛానల్‌ ద్వారా ప్రజలకు తెలియజేయాలని సుప్రీం కోర్టు 2018లో ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మలయాళ పత్రిక ‘వీక్షణం’లో తనపై నమోదైన కేసులను వివరిస్తూ కురియాకోస్‌ ఎనిమిది పేజీల యాడ్‌ ఇచ్చారు. ఆ పత్రిక యాడ్‌ టారిఫ్‌ ప్రకారం ఆ యాడ్‌ కనీసంగా కోటి రూపాయలు అవుతుంది. ఈ ఒక్క కారణంగా ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయవచ్చు. ఎందుకంటే లోక్‌సభ అభ్యర్థి ఎన్నికల ఖర్చు 70 లక్షల రూపాయలు దాటవద్దు.

కురియాకోస్‌ యాడ్‌ను ఏప్రిల్‌ 17,18,19 తేదీల్లో పత్రికా ఇదుక్కి ఎడిషన్లో ప్రచురించారు. అలాగే ‘జైహింద్‌ టీవీ’ ఛానల్‌లో యాడ్‌ను ప్రసారం చేశారు. అయితే ఈ రెండు మీడియా సంస్థలు కాంగ్రెస్‌ పార్టీకే చెందినవి అవడం వల్ల యాడ్స్‌కు కేవలం 2.4 లక్షల రూపాయలు మాత్రమే చార్జి చేసినట్లు చూపించారు. తమ పార్టీ అభ్యర్థి అవడం వల్ల ఆ మాత్రం రాయితీ ఇవ్వక తప్పలేదని వీక్షణం పత్రిక అడ్వర్టయిజ్‌ విభాగం అధిపతి అనిల్‌ జార్జి తెలిపారు. గత ఫిబ్రవరిలో జరిగిన ఇద్దరు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల హత్యకు నిరసనగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు సంబంధించే ఆయనపై ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

పట్టణంతిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కే. సురేంద్రన్‌పై ఏకంగా 242 కేసులు ఉన్నాయి. ఆయన ‘జన్మభూమి’ పార్టీ పత్రికలో మూడు రోజుల పాటు కేసులకు సంబంధించిన యాడ్‌ను ఇవ్వడంతోపాటు ఆరెస్సెస్‌కు చెందిన ‘జనం టీవీ’ ఛానల్‌లో యాడ్‌ ఇచ్చారు. పత్రికలో వచ్చిన సురేంద్రన్‌ యాడ్‌కు టారిఫ్‌ ప్రకారం 40 లక్షల రూపాయలు అవుతుందని, అయితే ఇంకా బిల్లు చేయలేదని, పార్టీ నాయకత్వంతో మాట్లాడాక బిల్లును సెటిల్‌ చేస్తామని పత్రిక యాడ్‌ విభాగం అధిపతి శరత్‌ చంద్రన్‌ తెలిపారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించిన కారణంగానే ఆయనపై ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

ఇక పాలకపక్ష సీపీఎం పార్టీ ఎనిమిది మంది పార్టీ అభ్యర్థుల నేర చరితను వివరిస్తూ పార్టీ పత్రిక ‘దేశాభిమాని’లో ఏప్రిల్‌ 19, 20, 21 తేదీల్లో వరుసగా యాడ్స్‌ ఇచ్చింది. వాటి బిల్లు ఎంతయిందని పత్రికా యాజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా, ఈ బిల్లును రూపొందించలేదని, ఎన్నికల అనంతరం బిల్లు సంగతి చూస్తామని చెప్పారు. అభ్యర్థు నేర చరితలకు సంబంధించిన యాడ్స్‌ బిల్లులను ఎన్నికల ఖర్చు పరిమితి నుంచి తప్పించాలని వివిధ పార్టీలు ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ మినహాయింపు ఇవ్వడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కేసులు ఉన్నట్లయితే ఆ కేసుల వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలంటూ 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను భారత ఎన్నికల కమిషన్‌ అమలు చేస్తోంది. గతంలో రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరమ్‌ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లోను సుప్రీం తీర్పును ఎన్నికల కమిషన్‌ అమలు చేసింది. కేరళలో ప్రతి రాజకీయ పార్టీకి పత్రికలు, టీవీ ఛానళ్లు ఉండడం వల్ల ఎన్నికల పరిమితి వ్యయం నుంచి అభ్యర్థులు తప్పించుకోగలుగుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-07-2019
Jul 04, 2019, 14:21 IST
చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ ప్రకటించింది....
09-06-2019
Jun 09, 2019, 05:00 IST
పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడమంటే...
09-06-2019
Jun 09, 2019, 04:52 IST
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే...
08-06-2019
Jun 08, 2019, 08:12 IST
సాక్షి, అమరావతి: ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సొంత పార్టీ నేతల వద్ద అభిప్రాయపడ్డారు....
08-06-2019
Jun 08, 2019, 04:07 IST
న్యూఢిల్లీ: సాధారణంగా ప్రధానమంత్రి తర్వాత ప్రమాణం స్వీకారం చేసే వ్యక్తినే ప్రభుత్వంలో నంబర్‌ 2గా భావిస్తారు. అలా చూస్తే మోదీ...
06-06-2019
Jun 06, 2019, 19:56 IST
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటు వేసిన వారికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలిపింది....
06-06-2019
Jun 06, 2019, 19:54 IST
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి ఓడిపోతారని, సంపన్నులను మాత్రమే ఆయన పట్టించుకుంటున్నారు..కానీ...
06-06-2019
Jun 06, 2019, 16:53 IST
చండీగఢ్‌ : మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశానికి డుమ్మా...
06-06-2019
Jun 06, 2019, 15:31 IST
ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొంటున్నారని ఉత్తమ్‌ విమర్శించారు.
06-06-2019
Jun 06, 2019, 14:02 IST
మహా భారతంలో కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఘట్‌బంధన్‌ విఫలమై విడిపోవడానికి...
06-06-2019
Jun 06, 2019, 10:41 IST
స్థానిక నాయకుల వల్లే కుప్పంలో తగ్గిన మెజారిటీ
06-06-2019
Jun 06, 2019, 08:25 IST
 చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచిన ముగ్గురు ఎంపీలు పదవుల కోసం రచ్చకెక్కడంతో తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. ...
05-06-2019
Jun 05, 2019, 17:31 IST
తెలుగు దేశం పార్టీలో లోక్‌సభ పదవుల పందేరం చిచ్చు రేపింది.
05-06-2019
Jun 05, 2019, 15:34 IST
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి ఘోరంగా విఫలమవ్వడంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గుడ్‌బై చెప్పిన...
05-06-2019
Jun 05, 2019, 13:14 IST
రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
05-06-2019
Jun 05, 2019, 11:45 IST
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. తమ పార్టీతో పెట్టుకుంటే...
05-06-2019
Jun 05, 2019, 09:03 IST
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్‌ ఇచ్చారు. పార్లమెంటరీ విప్‌ పదవిని ఆయన తిరస్కరిస్తూ...
05-06-2019
Jun 05, 2019, 08:29 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ...
05-06-2019
Jun 05, 2019, 07:52 IST
న్యూఢిల్లీ/లక్నో: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన ‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న...
04-06-2019
Jun 04, 2019, 20:13 IST
సొంత పార్టీని ఇరుకునపెట్టేవిధంగా ప్రవర్తించిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌పై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top