రిజర్వేషన్ల కోసం హార్దిక్‌ ఆమరణ దీక్ష | Hardik Patel begins indefinite hunger strike demanding Patidar quota | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల కోసం హార్దిక్‌ ఆమరణ దీక్ష

Aug 26 2018 4:01 AM | Updated on Aug 26 2018 4:01 AM

Hardik Patel begins indefinite hunger strike demanding Patidar quota - Sakshi

హార్దిక్‌ పటేల్‌

అహ్మదాబాద్‌: విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో పటీదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పాస్‌) చీఫ్‌ హార్దిక్‌ పటేల్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దతుదారుల సమక్షంలో హార్దిక్‌ తన ఫాంహౌస్‌లో దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రాంగణానికి పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలిరావటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానాపాట్లు పడ్డారు. మరోవైపు పలువురు కాంగ్రెస్‌ నేతలు హార్దిక్‌ను కలసి తమ మద్దతు తెలిపారు. ఈ దీక్ష వెనుక కాంగ్రెస్‌ హస్తం ఉందని ప్రభుత్వం ఆరోపించింది. రెండు నెలల క్రితం దీక్షకు అనుమతి కోరామని..అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వలేదని హార్దిక్‌ ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement