మున్సిపోల్స్‌కు రె'ఢీ' | The stage is set for municipal elections in Ap | Sakshi
Sakshi News home page

మున్సిపోల్స్‌కు రె'ఢీ'

Oct 13 2026 4:49 AM | Updated on Oct 13 2026 4:49 AM

The stage is set for municipal elections in Ap

రాష్ట్రంలో మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు

17 కార్పొరేషన్లతో పాటు 106 మున్సిపాలిటీలు, 

నగర పంచాయతీలకు రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లు

పునర్విభజన ప్రకారం వార్డులకు రిజర్వేషన్లు

120 వార్డులతో రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్‌గా గ్రేటర్‌ విశాఖ

86 వార్డులతో రెండో స్థానంలో విజయవాడ

అతి తక్కువ వార్డులున్న కార్పొరేషన్లు మచిలీపట్నం, చిత్తూరు

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 17 మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు రొటేషన్‌ పద్ధతిలో మేయర్లు, మున్సిపల్, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మేయర్లు, మున్సిపల్, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుంది. 

అయితే తొలి విడతలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. వీటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. మిగిలిన వాటికి త్వరలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. 120 వార్డులతో గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అతి పెద్దది కాగా.. రెండో స్థానంలో 86 వార్డులతో విజయవాడ కార్పొరేషన్‌ ఉంది. 60 వార్డుల చొప్పున చిన్న కార్పొరేషన్లుగా మచిలీపట్నం,  చిత్తూరు ఉన్నాయి.

కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్లు ఇలా...
ఎస్టీ జనరల్‌     1:    మంగళగిరి –తాడేపల్లి 
ఎస్సీ మహిళ     1:    కర్నూలు 
ఎస్సీ జనరల్‌     1:    రాజమహేంద్రవరం 
బీసీ మహిళ     2:    కాకినాడ, మచిలీపట్నం 
బీసీ జనరల్‌     3:    ఏలూరు, అనంతపురం, చిత్తూరు 
జనరల్‌ మహిళ     5:    గ్రేటర్‌ విశాఖపట్నం, విజయనగరం,  శ్రీకాకుళం, గుంటూరు, కడప 
అన్‌ రిజర్వ్‌డ్‌     4:    తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు 

కార్పొరేషన్లలో వార్డుల రిజర్వేషన్లు 
1.విజయనగరం: మొత్తం వార్డులు 62 
ఎస్టీ జనరల్‌–1, ఎస్సీ జనరల్‌–4, ఎస్సీ మహిళ–3, బీసీ జనరల్‌–12, బీసీ మహిళ–11, జనరల్‌ మహిళ–17, అన్‌రిజర్వ్‌డ్‌–14 

2. గ్రేటర్‌ విశాఖపట్నం: మొత్తం వార్డులు 120 
ఎస్టీ జనరల్‌–1, ఎస్సీ జనరల్‌–5, ఎస్సీ మహిళ–5, బీసీ జనరల్‌–25, బీసీ మహిళ–24, జనరల్‌ మహిళ–31, అన్‌ రిజర్వ్‌డ్‌–29 

3. ఏలూరు: మొత్తం వార్డులు 62 
ఎస్టీ జనరల్‌–1, ఎస్సీ జనరల్‌–4, ఎస్సీ మహిళ–4, బీసీ జనరల్‌–11, బీసీ మహిళ–11, జనరల్‌ మహిళ–16, అన్‌రిజర్వ్‌డ్‌–11 

4 . మచిలీపట్నం: మొత్తం వార్డులు 60 
ఎస్టీ జనరల్‌–1, ఎస్సీ జనరల్‌–3, ఎస్సీ మహిళ–2, బీసీ జనరల్‌–12, బీసీ మహిళ–12, జనరల్‌ మహిళ–16, అన్‌రిజర్వ్‌డ్‌–14 

5. విజయవాడ: మొత్తం వార్డులు 86 
ఎస్టీ జనరల్‌–1, ఎస్టీ మహిళ–1, ఎస్టీ జనరల్‌–5, ఎస్సీ మహిళ–5, బీసీ జనరల్‌–16, బీసీ మహిళ–15, జనరల్‌ మహిళ–22, అన్‌రిజర్వ్‌డ్‌–21

6. గుంటూరు: మొత్తం వార్డులు 76 
ఎస్టీ జనరల్‌–1, ఎస్టీ మహిళ–1, ఎస్సీ జనరల్‌–5, ఎస్సీ మహిళ–4, బీసీ జనరల్‌–14, బీసీ మహిళ–11, జనరల్‌ మహిళ–20, అన్‌రిజర్వ్‌డ్‌–18 

7. ఒంగోలు: మొత్తం వార్డులు 62 
ఎస్టీ జనరల్‌–1, ఎస్టీ మహిళ–1, ఎస్సీ జనరల్‌–6, ఎస్సీ మహిళ–5, బీసీ జనరల్‌–9, బీసీ మహిళ–9, జనరల్‌ మహిళ–16, అన్‌రిజర్వ్‌డ్‌–15 

8. నెల్లూరు: మొత్తం వార్డులు 72 
ఎస్టీ జనరల్‌–2, ఎస్టీ మహిళ–1, ఎస్సీ జనరల్‌–5, ఎస్సీ మహిళ–5, బీసీ జనరల్‌–12, బీసీ మహిళ–11, జనరల్‌ మహిళ–19, అన్‌రిజర్వ్‌డ్‌–17 

9. కర్నూలు: మొత్తం వార్డులు 68 
ఎస్టీ జనరల్‌–1,  ఎస్సీ జనరల్‌–6, ఎస్సీ మహిళ–6, బీసీ జనరల్‌–11, బీసీ మహిళ–10, జనరల్‌ మహిళ–18, అన్‌రిజర్వ్‌డ్‌–16 

10. కడప: మొత్తం వార్డులు 66 
ఎస్టీ జనరల్‌–1, ఎస్సీ జనరల్‌–4, ఎస్సీ మహిళ–4, బీసీ జనరల్‌–12, బీసీ మహిళ–12, జనరల్‌ మహిళ–17, అన్‌రిజర్వ్‌డ్‌–16 

11 . అనంతపురం: మొత్తం వార్డులు 62 
ఎస్టీ జనరల్‌–1, ఎస్టీ మహిళ–1, ఎస్సీ జనరల్‌–2, ఎస్సీ మహిళ–2, బీసీ జనరల్‌–13, బీసీ మహిళ–12, జనరల్‌ మహిళ–16, అన్‌రిజర్వ్‌డ్‌–15 

12. చిత్తూరు: మొత్తం వార్డులు 60 
ఎస్టీ జనరల్‌–1, ఎస్సీ జనరల్‌–5, ఎస్సీ మహిళ–5, బీసీ జనరల్‌–10, బీసీ మహిళ–9, జనరల్‌ మహిళ–16, అన్‌రిజర్వ్‌డ్‌–14 

13. తిరుపతి: మొత్తం వార్డులు  66 
ఎస్టీ జనరల్‌–1, ఎస్సీ జనరల్‌–4, ఎస్సీ మహిళ–3, బీసీ జనరల్‌–13, బీసీ మహిళ–12, జనరల్‌ మహిళ–18, అన్‌రిజర్వ్‌డ్‌–15  

మున్సిపల్‌ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు..  
ఎస్టీ జనరల్‌–02, ఎస్టీ మహిళ–01, ఎస్సీ జనరల్‌–07, ఎస్సీ మహిళ–07, బీసీ జనరల్‌–18, బీసీ మహిళ–18, జనరల్‌ మహిళ – 27, అన్‌రిజర్వ్‌డ్‌ –26 

కేటగిరీల వారీగా రిజర్వేషన్లు 
ఎస్టీ మహిళ: గూడూరు 
ఎస్టీ జనరల్‌: అలూరు, ఆత్మకూరు 
ఎస్సీ మహిళ: చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల 
ఎస్సీ జనరల్‌:  ఉయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల 
బీసీ మహిళ: ఆళ్లగడ్డ, సాలూరు, ఇచ్ఛాపురం, నర్సీపట్నం, ఎర్రగుంట్ల, జంగారెడ్డి గూడెం, పాలకొండ, తుని, పాలకొల్లు, కదిరి, పుంగనూరు, రాజంపేట, గుడివాడ, రాజాం, గుంతకల్లు, గూడూరు, నందికొట్కూరు, ముమ్మిడివరం 
బీసీ జనరల్‌: పిడుగురాళ్ల, పుత్తూరు, బేతంచెర్ల, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, మదనపల్లె, తాడిపర్తి, తిరువూరు, నంద్యాల, హిందూపురం, మడకశిర, నెల్లిమర్ల, పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, తాడిగడప, బి.కొత్తకోట 
జనరల్‌ మహిళ: కనిగిరి, కమలాపురం, కొవ్వూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆత్మకూరు, నర్సాపూర్, పలాస–కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పొన్నూరు, భీమవరం, చిలకలూరిపేట, జగ్గయ్యపేట, ఆమదాలవలస, మాచర్ల, ఆదోని, నాయుడుపేట, డోన్, బొబ్బిలి, రేపల్లె, పార్వతీపురం, పులివెందుల 
అన్‌రిజర్వ్‌డ్‌: తణుకు, తెనాలి, గురజాల, తాడేపల్లిగూడెం, అమ లాపురం, ఎమ్మిగనూరు, కావలి, ప్రొద్దుటూరు, నందిగామ, కందుకూరు, మండపేట, దాచేపల్లి, నగిరి, చీమకుర్తి, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, గొల్లప్రోలు, అద్దంకి, పెద్దాపురం, ధర్మవరం, బద్వేల్, దర్శి, మార్కాపురం, మైదుకూరు, నర్సారావుపేట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement