పుర పోరుకు సై | Elections in 13 corporations and 87 municipalities | Sakshi
Sakshi News home page

పుర పోరుకు సై

Oct 14 2026 4:51 AM | Updated on Oct 14 2026 4:51 AM

Elections in 13 corporations and 87 municipalities

100 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి 

మొత్తం వార్డులు 3,942.. పోలింగ్‌ బూత్‌లు 12,244  

13 కార్పొరేషన్లు, 87 పురపాలికల్లో ఎన్నికలు 

విశాఖ కార్పొరేషన్‌లో అత్యధికంగా 1,990 పోలింగ్‌ స్టేషన్లు 

కమలాపురం, మడకశిరలో తక్కువ కేంద్రాలు 

సాక్షి, అమరావతి:  పుర పోరుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి.  అధికార యంత్రాంగం పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు షురూ చేసింది. ఎన్నికల సామగ్రిని జిల్లా కేంద్రాలకు తరలించింది. మున్సిపాలిటీల వారీగా పోలింగ్‌ బూత్‌ల తుదిజాబితా కూడా సిద్ధమైంది. 

23 మున్సిపాలిటీల్లో రెండో విడతలో.. 
రాష్ట్రంలో 17 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నా­యి. వీటిలో తొలి విడతలో 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లుచేశారు. మిగిలిన 23 మున్సిపాలిటీల్లో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో 3,942 వార్డులున్నాయి.

13 కార్పొరేషన్ల పరిధిలో 922 వార్డులు, 87 పురపాలికల్లో 3,020 ఉన్నాయి. ఎన్నికల కోసం మొత్తం 12,244 పోలింగ్‌ స్టేషన్లను ఖరారు చేశారు. రాష్ట్రంలోనే పెద్ద కార్పొరేషన్‌గా ఉన్న గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 120 వార్డులకు గానూ 1,990 పోలింగ్‌ స్టేషన్లను గుర్తించారు. మడకశిర, కమలాపురం పురపాలికల్లో 23 వార్డులు చొప్పున ఉండగా.. పోలింగ్‌ కేంద్రాలు కూడా 23 చొప్పునే ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement