'బతుకులు చెడ' అని కేసీఆర్‌ ఊరికే అనలా! | GVL Fires on Chandrababu naidu over U turn on High court | Sakshi
Sakshi News home page

Dec 28 2018 3:33 PM | Updated on Dec 28 2018 3:58 PM

GVL Fires on Chandrababu naidu over U turn on High court - Sakshi

యూ-టర్న్ సీఎం చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారని జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు.

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. యూ-టర్న్ సీఎం చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారని ట్విటర్‌లో పేర్కొన్నారు. విభజన చట్టం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్ర హైకోర్టుకు సహకరిస్తే చంద్రబాబు నీచంగా రాజకీయాలు ఆపాదిస్తున్నారని నిప్పులు చెరిగారు. నిన్నకు నిన్న క్రెడిట్ తమదేనని ఎంపీ కే. రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారని గుర్తు చేశారు. మీ 'బతుకులు చెడ' అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఊరికే అనలా! అంటూ జీవీఎల్‌ ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement