ఎన్‌ఎస్‌యూఐకి మార్గదర్శక మండలి  | Guidance council to NSUI | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌యూఐకి మార్గదర్శక మండలి 

Feb 25 2018 2:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

Guidance council to NSUI - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐకి మార్గదర్శనం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. పార్టీ సీనియర్‌ నాయకులతో ఓ మండలిని ఏర్పాటుచేశారు. రాజస్తాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్, పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, మానిక్‌ టాగోర్‌లు అ మండలిలో ఉన్నారు. ‘ఐవైసీ, ఎన్‌ఎస్‌యూఐ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ను ఈ మార్గదర్శక మండలి భర్తీచేస్తుంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ ద్వివేదీ పేర్కొన్నారు.

ఎన్‌ఎస్‌యూఐ చీఫ్, ఎన్‌ఎస్‌యూఐ ఏఐసీసీ ఇన్‌చార్జిలు ఈ మండలిలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారు. మండలితోపాటుగా 37 మంది కార్యదర్శులతో యూత్‌ కాంగ్రెస్‌ను కూడా రాహుల్‌ విస్తరించారు. అమరీష్‌ రంజన్‌ పాండేను యూత్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా నియమించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement