నాలుగైదు సీట్లలో స్నేహపూర్వక పోటీ!

Friendly competition in four five seats : kodandaram - Sakshi

కాంగ్రెస్‌ ప్రతిపాదించిన సీట్లు 10

టీజేఎస్‌ కోర్‌ కమిటీకి నివేదించిన కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలో భాగంగా 10 సీట్లలో పోటీచేయాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించినట్టు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. టీజేఎస్‌ కోర్‌ కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగింది. పొత్తుల వివరాలు, కేటాయించిన సీట్లు, భవిష్యత్‌ కార్యాచరణను కోదండరాం వెల్లడిం చారు. ప్రతిపాదించిన సీట్లలో ఇప్పటిదాకా 7 సీట్లకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో ఆమోదం తెలిపిందని చెప్పారు. మిగిలిన సీట్ల విషయంలో ఢిల్లీలో జరుగుతున్న స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో చర్చల తర్వాత స్పష్టత వస్తుందన్నారు.

కాంగ్రెస్, టీజేఎస్‌ పార్టీల్లో ఆశావహుల మధ్య పోటీ ఉన్న నాలుగైదు సీట్ల విషయంలో స్నేహపూర్వక పోటీ చేసుకుందామని కాం గ్రెస్‌ ప్రతిపాదించిందనే విషయాన్ని కోదండరాం కోర్‌ కమిటీలో వెల్లడించినట్టు తెలిసింది. అయితే, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాల్సిన సీట్ల విషయంలో కాంగ్రెస్‌ వైఖరిపై కోర్‌ కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎస్టీలకు ఆసిఫాబాద్‌ను కేటాయించాలని కోర్‌ కమిటీ డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. ఎస్సీ అభ్యర్థి కోసం స్టేషన్‌ ఘన్‌పూర్‌ లేదా వర్ధన్నపేటలో ఒక సీటు కోసం పట్టుబట్టాలని కమి టీ సూచించింది. వీటితోపాటు చెన్నూరును కూడా టీజేఎస్‌ కోరుతున్నట్టు తెలిసింది.

ఏయే సీట్లు.. అభ్యర్థులెవరు?
మల్కాజిగిరి, రామగుండం, మెదక్, దుబ్బాక, వరంగల్‌ తూర్పు, చాంద్రాయణగుట్ట, సిద్దిపేట నియోజకవర్గాల్లో టీజేఎస్‌ పోటీ చేయాలని కాంగ్రెస్‌ ప్రతిపాదించింది. మల్కాజిగిరి నుంచి దిలీప్‌కుమార్, రామగుండంలో కోదండరాం పేర్లను అనుకుంటున్నారు. కోదండరాం పోటీ చేయకుంటే కోరం కనకయ్య, బీరయ్య యాదవ్‌ పేర్లను పరిశీలిం చే అవకాశముంది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి గాదె ఇన్నయ్య పేరును దాదాపుగా ఖరారు చేశారు.

దుబ్బాక నియోజకవర్గం నుంచి చింద రాజ్‌కుమార్, మెదక్‌ నుంచి జనార్దన్‌రెడ్డి(అడ్వొకేట్‌), సిద్ది పేట నుంచి భవానీరెడ్డి పేర్లను నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే, కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ చెప్పింది. మిర్యాలగూడ, నిజామాబాద్‌ అర్బన్, మహబూబ్‌నగర్, మహబూ బాబాద్, ఎల్లారెడ్డి, మేడ్చల్‌ వంటి నియోజకవర్గాలపై చర్చ జరుగుతోంది. పాత జిల్లాకు ఒక్కస్థానం చొప్పునైనా నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కనీసం ఒక్కొక్క స్థానం ఇవ్వాలని టీజేఎస్‌ పట్టుబడుతోంది. వీటిని బట్టి ఎక్కడెక్కడ స్నేహపూర్వక పోటీ అనే విషయం తేలనుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top