ముచ్చటగా నాలుగో సారి.. | This Is The Fourth Time Kcr Coming To Mahabubnagar | Sakshi
Sakshi News home page

ముచ్చటగా నాలుగో సారి..

Jun 29 2018 1:22 PM | Updated on Oct 8 2018 5:07 PM

This Is The Fourth Time Kcr Coming To Mahabubnagar  - Sakshi

జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో కుటుంబ సమేతంగా కేసీఆర్‌ (ఫైల్‌)    

అలంపూర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గానికి ముచ్చటగా నాలుగో సారి రానున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సారధిగా మొట్టమొదటి సారి కేసీఆర్‌ అలంపూర్‌ విచ్చేశారు. 2002లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టిన పాదయాత్రను అలంపూర్‌ క్షేత్రం నుంచే మొదలు పెట్టారు. రెండో సారి 2014 ఏప్రిల్‌ 25వ తేదీన పార్టీ సారధిగా ప్రచారంలో భాగంగా అలంపూర్‌ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

అలాగే 2016 ఆగస్టు 11వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ అలంపూర్‌ నియోజకవర్గ కేంద్రానికి వచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ముఖ్యమంత్రి రాత్రి అలంపూర్‌లోనే బస చేసి 12వ తేదీన గుందిమల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌లో కృష్ణా పుష్కరాలను ప్రారంభించారు.  ప్రస్తుతం రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద జరుగుతున్న ఎత్తిపోతల పథకం నిర్మాణం పరిశీలన నిమిత్తం ఆయన నాలుగో సారి రానున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement