
న్యూఢిల్లీ: అధికార బీజేపీలో మరో పెద్ద వికెట్ పడింది. తొలితరం నేతల్లో ఒకరు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా శుక్రవారం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బాహాటంగా విమర్శలు చేస్తోన్న ఆయన.. ఎట్టకేలకు కాషాయదళం నుంచి బయటికి వచ్చేశారు. ఈ సందర్భంగా ‘రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నాను..’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
నెక్స్ట్ ఏంటి?: చాలా కాలంగా మోదీపై విమర్శలు చేస్తోన్న సిన్హా.. బీజేపీని వీడిన తర్వాత కాంగ్రెస్‌లోకి చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. కాగా, తాను ఏ పార్టీలోనూ చేరబోవడంలేదని సిన్హా స్పష్టం చేశారు. జనవరిలో తాను ప్రారంభించిన ‘రాష్ట్ర మంచ్’ సంస్థ పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని, ప్రభుత్వాలు తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై నిరవధికంగా పోరాడుతానని యశ్వంత్ చెప్పారు.