కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

Former Union Minister Raghunath Jha Passes Away - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత రఘునాథ్‌ ఝా ఇక లేరు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. 79 ఏళ్ల రఘునాథ్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

బిహార్‌లోని బెట్టాయ్‌కు చెందిన రఘునాథ్‌ ఆర్జేడీ తరపున 14వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై.. భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా పని చేశారు. 1960లో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన తొలుత కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. తర్వాత జనతా పార్టీ, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు మారిన ఆయన చివరికి 2015లో సమాజ్‌వాదీ పార్టీలోకి చేరిపోయారు. అయితే 16 నెలలకే తిరిగి ఆయన లాలూ పార్టీలో తిరిగి చేరారు.

రఘునాథ్‌కు 1990లో బిహార్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కినట్లే దక్కి చేజారిపోయింది. బిహార్‌ తరపున సమాజ్‌వాదీ పార్టీకి ఎంపికైన తొలి ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్‌ చేశారు. కాగా, ఆయనకు భార్య, ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top