కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే? | former TDP MLA Sridevi Join In Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే?

Apr 7 2019 8:51 AM | Updated on Apr 7 2019 8:52 AM

former TDP MLA Sridevi Join In Congress - Sakshi

మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి

బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరాలని ఆమెకు  అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కాంగ్రెస్‌ గూటిలో చేరడానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో తన అనుచరులతో కలిసి శ్రీదేవి కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడానికి సంసిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.

శ్రీదేవి టీడీపీ పక్షాన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో చేరి పని చేశారు. ప్రస్తుతం ఆమె మరోమారు కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు ప్రకటించాయి.  మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కే.సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement