‘108’లోనూ అవినీతి.. తెలంగాణ కంటే 4లక్షలు ఎక్కువ ఖర్చు!! | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 31 2018 1:33 PM

Former Minister Laxma Reddy Fires On AP CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, షాద్‌నగర్‌ : 108 వాహనాల కొనుగోళ్లలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ వైద్యాశాఖ తాజా మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోపించారు. షాద్‌నగర్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఒక్కో 108 వాహనానికి తెలంగాణ ప్రభుత్వం కంటే రూ. నాలుగు లక్షలు ఎక్కువగా పెట్టి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దీని వెనుక అవినీతి జరిగిందని ఆయన తెలిపారు. జన్మభూమి కమిటీలతోనే చంద్రబాబు సర్కార్‌ అవినీతి మొదలైందని, మహబూబ్‌నగర్‌లో కరువు పేరుతో ప్రపంచబ్యాంకు నిధులను తెచ్చి దోచుకున్న చరిత్ర చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అవినీతిపై ప్రచారం చేస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement