‘1989 నుంచి కేసీఆర్‌ నాకు స్ఫూర్తి’

Ex Speaker Suresh Reddy Joins In TRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు ఉపందుకున్నాయి. మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి బుధవారం అపద్దర్మ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, కేటీఆర్‌, ఎంపీలు కేశవరావు, కల్వకుంట్ల కవితల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. 1989 నుంచి కేసీఆర్‌ తనకు స్పూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలన్న కేసీఆర్‌ కోరిక మేరకే కాంగ్రెస్‌తో బంధాన్ని వదిలి, రేపటి తరాల భవిష్యత్‌ కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని వెల్లడించారు.

సురేష్‌రెడ్డితోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులు, ఉప్పల్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ లక్ష్మారెడ్డి, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ శాంతి సైజన్‌, కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ గౌడ్‌, బిరుదు రాజమల్లులు కూడా టీఆర్‌ఎస్‌ చేరారు.  ఈ కార్యక్రమంలో పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top