టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. ఏరాసు, ఎస్పీవై నిరసన | Erasu Pratap Reddy, SPY Reddy Upset With TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. ఏరాసు, ఎస్పీవై నిరసన

Mar 10 2019 1:52 PM | Updated on Mar 10 2019 8:01 PM

Erasu Pratap Reddy, SPY Reddy Upset With TDP - Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లా టీడీపీలో తీవ్ర అసమ్మతి వ్యక్తమవుతోంది. టీడీపీ అధిష్టానం వైఖరిపై సీనియర్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీనియర్‌ నేతలు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డితో పాటు గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది, ఆ తర్వాత టీడీపీకు మద్దతు తెలిపిన ఎస్పీవై రెడ్డి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

కాగా గౌరు చరితారెడ్డి దంపతులు టీడీపీలో చేరిన కార్యక్రమానికి ఏరాసు ప్రతాప్‌రెడ్డి గైర్హాజరైన సంగతి తెలిసిందే. పాణ్యం సీటును గౌరు చరితకు కేటాయించడంతో ఏరాసు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు నంద్యాల సీటు విషయంలో సీనియర్‌ నేత ఎస్పీవై రెడ్డి అలకబూనారు. గంగుల ప్రతాప్‌రెడ్డిని పక్కనపెట్టడంతో ఆయన కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement