కేంద్ర మంత్రికి ఈసీ షాక్‌

EC Warns Mukhtar Abbas Naqvi Over Modi Ki Sena Comment - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాంపూర్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ చేసిన మోదీ ఆర్మీ (మోదీ కీ సేన) వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో భద్రతా దళాలను ఉద్దేశించి రాజకీయాలకు ముడిపెట్టే వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసింది.
ఇక అంతకుముందు ఈసీ అధికారులు ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు కేంద్ర మంత్రి అంగీకరించారు. కాగా ఎన్నికల ప్రచారంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌ను కూడా ఈసీ వివరణ కోరింది. ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఆయనను ఈసీ హెచ్చరించింది. 48 గంటల పాటు ప్రచారం చేపట్టరాదని యోగి ఆదిత్యానాధ్‌ను సోమవారం ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top