మంచి స్నేహితుడిని కోల్పోయాను.. | DS, CPI Narayana express condolences to YS Vivekananda Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి బాధాకరం

Mar 15 2019 2:51 PM | Updated on Mar 15 2019 3:23 PM

DS, CPI Narayana express condolences to YS Vivekananda Reddy - Sakshi

 సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ... వివేకానందరెడ్డి మృతి బాధాకరమని, ఆయనతో కలిసి తాము పని చేశామని గుర్తు చేసుకున్నారు.

న్యూడిల్లీ : వైఎస్‌ వివేకానందరెడ్డి  ఆకస్మిక మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ... వివేకానందరెడ్డి మృతి బాధాకరమని, ఆయనతో కలిసి తాము పని చేశామని గుర్తు చేసుకున్నారు. ఆయన చాలా సౌమ్యుడు, వివాదాలకు అతీతంగా వ్యవహరించేవారు. దిగజారిన రాజకీయ సంస్కృతికి వివేకానందరెడ్డి అతీతుడు. ఆయన కుటుంబ సభ్యులకు సీపీఐ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని నారాయణ పేర్కొన్నారు. చదవండి.... (వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నుమూత)

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. ఆయన ఒక మంచి రాజకీయవేత్త. వివేకానందరెడ్డి మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ఆపద సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా.’ అని ఆకాంక్షించారు. అలాగే మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు  మాట్లాడుతూ... వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో ఓ నిజాయితీ గల నాయకుడిని ప్రజలు కోల్పోయారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement